For Money

Business News

కోలుకున్నా… తప్పని భారీ నష్టం

ఇవాళ మార్కెట్‌ భారీ హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం వంద పాయింట్ల నష్టంతో 17,595 వద్ద ప్రారంభమైనా… క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకుంది. పదింటికల్లా ఉదయం సెషన్‌ కనిష్ఠ స్థాయికి చేరింది. మిడ్‌ సెషన్‌కల్లా స్వల్పంగా కోలుకుంది. యూరో మార్కెట్ల భారీ నష్టాల కారణంగా నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17442 పాయింట్లకు పడిపోయింది. యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల నుంచి లాభాల్లోకి రావడంతో నిఫ్టి కోలుకుంది. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ మద్దతుతో కోలుకుంది. క్లోజింగ్‌లో కాస్త ఒత్తిడి వచ్చినా.. 17,526 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 149 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి గెయినర్స్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ నిలిచింది. కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు కూడా టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోవడం లేదు. ఇక నష్టాల్లో మెటల్స్‌ ముందున్నాయి. కోల్ ఇండియా, టాటా మోటార్స్‌ కూడా ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్ గరిష్ఠ స్థాయి నుంచి రూ. 60 క్షీణించింది. రూ. 4,500పైన ఈ షేర్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈ నెలలో ఇప్పటికి అనేక సార్లు ఈ స్థాయి నుంచి వెనక్కి వచ్చింది. ఫ్యూచర్స్‌ సూచీలను చూస్తుంటే అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.