విదేశీ అప్పులు: శ్రీలంక డీఫాల్ట్
విదేశీ అప్పుల విషయంలో శ్రీలంక డీఫాల్ట్ అయింది. విదేశాలతో పాటు విదేశీ సంస్థలకు ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ సమాచారం ఇచ్చింది. ఇచ్చిన రుణం ఇవ్వాల్సిన వడ్డీని రుణంగా మార్చమని శ్రీలంక ఆర్థిక శాఖ వెల్లడించింది. శ్రీలంక సమారు 5100 కోట్ల డాలర్ల అప్పును చెల్లించాల్సి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణ సాయం కోసం శ్రీలంక ఎదురు చూస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తరవాత శ్రీలంక రూపాయిలో అప్పులు తీసుకునేందుకు విదేశీ రుణదాతలు సిద్ధమవ్వాలని.. లేకుంటే తమ నుంచి రావాల్సిన వడ్డీని రుణంగా మార్చాల్సిందిగా కోరింది.