For Money

Business News

NIFTY TODAY: దిగువ స్థాయిలో మద్దతు?

సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ఉంది. రాత్రి క్రూడ్‌ ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ 102 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసినా.. ఆసియాలో భిన్న ధోరణలు కన్పిస్తున్నాయి. దేశీయ పరిణామల కారణంగా జపాన్‌ నిక్కీ భారీ నష్టాల్లో ఉంది. చైనా, జపాన్‌ దాదాపు స్థిరంగా ఉన్నట్లే. ఈ నేపథ్యంలో నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టికి దిగువ స్థాయిలోనే మద్దతు అందే అవకాశముంది. అయితే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ – 17923
రెండో ప్రతిఘటన – 17893
తొలి ప్రతిఘటన – 17874
నిఫ్టికి కీలకం – 17848
తొలి మద్దతు – 17741
రెండో మద్దతు – 17722
డౌన్‌ బ్రేకౌట్‌ – 17693