మే మొదటివారంలో LIC IPO?
పబ్లిక్ ఆఫర్ కోసం సెబి నుంచి తీసుకున్న అనుమతి గడువు మే 12తో అయిపోతుంది. ఆలోగానే పబ్లిక్ ఆఫర్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ ఆఫర్ ద్వారా ఏడు శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా రూ.50,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా ఆఫర్ ధర విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుతోంది. ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. మే నెలలో ఫెడ్ వడ్డీ రేట్లను అర శాతం పెంచే అవకాశముంది. ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మతుంటే దేశీయ ఇన్వెస్టర్లు కొంటున్నారు. మురి విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు లేకుండా సాధారణ ఇన్వెస్టర్ల నుంచి ఇంత భారీ ఇష్యూ మే నెలలో విజయవంతం అవుతుందా అన్న అనుమానం కూడా ఉంది. లేదంటే ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌కు భారీ అమ్మకాలు వెల్లువెత్తే అవకాశముంది. మరి సెంటిమెంట్ దెబ్బతింటే… ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారా అన్న అనుమానం ఉంది. పబ్లిక్ ఆఫర్ హిట్ అవ్వాలంటే… మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉండాలి… విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారీగా పాల్గొనాలి.