For Money

Business News

స్వల్ప కాలానికి ఈ రెండు షేర్లు

ఈవారంలో స్వల్ప కాలానికి రెండు షేర్లను సిఫారసు చేస్తున్నారు ఏంజిల్ వన్‌ చీఫ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సుమీత్‌ చవాన్‌. ఇపుడు మార్కెట్‌లో హాట్‌ షేర్లు సిమెంట్‌ షేర్లు. ఇటీవల కాస్త వెనక్కి తగ్గినా… సిమెంట్‌ షేర్లు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. అనేక మంది అనలిస్టులు సిమెంట్‌ రంగానికి చెందిన షేర్లను పలువురు అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. సుమీత్‌ రెకమెండ్‌ చేసిన షేర్‌ ఇండియా సిమెంట్స్‌. రూ. 218.30 వద్ద కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. రూ. 235 టార్గెట్‌తో రూ. 208.4 స్టాప్‌ లాస్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచి బేస్‌ సిద్ధం చేసుకుని కన్సాలిడేట్‌ అయిన ఈ షేర్‌ డైలీ చార్ట్స్‌ బుల్లిష్‌నెస్‌ చూపుతోంది. ఇక రెండో షేర్‌ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ) షేర్‌ను కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. డైలీ టైమ్‌ ఫ్రేమ్‌ ఛార్ట్‌లో బ్రేకౌట్‌కు ఈ షేర్‌ సిద్ధంగా ఉందని ఆయన అంటున్నారు.ఈ షేర్‌ను రూ.2276.50 వద్ద కొనుగోలు చేయాలని సుమీత్‌ సలహా ఇస్తున్నారు. రూ. 2390 టార్గెట్‌ కోసం రూ. 2195 స్టాప్‌లాస్‌త కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు.