For Money

Business News

స్థిరంగా సింగపూర్‌ నిఫ్టి

గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ స్వల్ప లాభాలతో ముగిసింది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్నందున బ్యాంకు షేర్లకు మద్దతు పెరుగుతోంది. దీంతో డౌజోన్స్‌ 0.4 శాతం లాభంతో ముగిసింది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్ పీ 500 షేర్లు 0.3 శాతం లాభంతో ముగిశాయి. ఇవాల ఉదయం నుంచి ఆసియా కూడా గ్రీన్‌లో ఉంది. వడ్డీ రేట్లను పెంచరాదని జపాన్‌ నిర్ణయించడంతో నిక్కీ దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు 0.4 శాతంపైగా గ్రీన్‌లో ఉన్నాయి. ఇక హాంగ్‌సెంగ్ కూడా 0.7 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లకు ఇవాళ, రేపు సెలవు. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 12 పాయింట్ల నష్టంతో 17,716 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.