For Money

Business News

దుమ్ము రేపిన బ్యాంకులు… నిఫ్టి సూపర్‌

నిఫ్టి మళ్ళీ 17700ను దాటింది. ఇవాళ క్లోజింగ్‌ ముందు జీఎస్టీ కలెక్షన్స్‌ వార్త మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జీఎస్టీ ప్రవేశ పెట్టిన తరవాత మొదటిసారి 1.42 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించి. చివరి అరగంటలో నిఫ్టి వంద పాయింట్లకు పైగా పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 205 పాయింట్ల లాభంతో రూ. 17670 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌708 పాయింట్ల లాభంతో 59,576 వద్ద ముగిసింది. ఇటీవల చాలా బలహీనంగా ఉన్న నిఫ్టి బ్యాంక్‌ గత కొన్ని రోజుల నుంచి దుమ్ము రేపుతోంది. ఇవాళ నిఫ్టి ఒక శాతం పెరిగితే…నిఫ్టి బ్యాంక్‌ 2.13శాతం పెరిగింది. నిఫ్టి ఫైనాన్షియల్స్ కూడా 1.87 శాతం పెరిగాయి. ఉదయం నుంచి నిఫ్టి టాప్‌ గెయినర్‌గా ఎన్‌టీపీసీ కొనసాగింది. రికార్డు స్థాయిలో 5.78 శాతం లాభపడింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో ప్రవేశించిన పేటీఎం తొలిరోజే 8 శాతం లాభంతో ముగిసింది. ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో టాపర్‌గా నిలిచింది.