MID REVIEW: నిఫ్టి ఊగిసలాట
మార్చి నెల వీక్లీ, మంత్లి డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా మార్కెట్ తీవ్ర స్థాయిలో హెచ్చతగ్గులకు లోనౌతోంది. ఇప్పటి వరకు ఏడు సార్లు నిఫ్టి లాభాల్లో నుంచి నష్టాల్లోకి వెళ్ళింది. మిడ్ సెషన్లో అంటే యూరప్ మార్కెట్లు ప్రారంభం కావడానికి ముందు నిఫ్టి 17456 పాయిట్లను తాకింది. ఉదయం గరిష్ఠ స్థాయి 17519 స్థాయి నుంచి వంద పాయింట్లు క్షీణించిందన్నమాట. మెటల్ ల్యాబ్స్ తరవాత దివీస్ ల్యాబ్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. నిఫ్టి నష్టాల్లో ఉన్నా… ఇతర ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. లాభనష్టాలు నామ మాత్రంగా ఉండటం కాస్త ఉపశమనం కల్గించే అంశం. నిఫ్టిలో 25 షేర్లు గ్రీన్‌లో ఉంటే 25 షేర్లు రెడ్‌లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా. అయితే ఇవి కూడా నామమాత్రపు లాభాలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టి మార్చి డెరివేటివ్స్‌ను ఎలా ముగుస్తుందో చూడాలి.