కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగుల డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి చేరింది. పెంచిన డీఏను జనవరి 1, 2022 నుంచి వర్తింపజేస్తారు.దీనివల్ల 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. డీఏ పెంచడం వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే . 2021 జులైలోనే దాన్ని పునరుద్ధరిండమే గాక, బకాయిల ఉన్న మొత్తం డీఏను పెంచారు.