For Money

Business News

NIFTY TODAY: 17300 కీలకం

సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. నిన్న నిఫ్టి 17222 పాయింట్ల వద్ద ముగిసింది. సో ఆరంభంలోనే నిఫ్టి 17300ను దాటే అవకాశముంది. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడం మార్కెట్‌కు అనుకూల అంశం కాగా, ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరిగే శాంతి చర్చలు కూడా కీలకం కానున్నాయి. పైగా ఎల్లుండి మార్చి నెల డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున… షార్ట్‌ కవరింగ్‌ కూడా ఛాన్స్‌ ఉంది. శాంతి చర్చలు ఏమాత్రం సానుకూల సంకేతాలు ఇచ్చినా… మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడయ్యే అవకాశముంది. నిఫ్టికి గట్టి నిరోధం 17330 ప్రాంతంలో ఎదురైనా… 17370 దాటితో గట్టి ర్యాలీకి ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17370
రెండో ప్రతిఘటన 17330
తొలి ప్రతిఘటన 17300
నిఫ్టికి కీలకం 17155
తొలి మద్దతు 17140
రెండో మద్దతు 17115
డౌన్‌ బ్రేకౌట్‌ 17077