For Money

Business News

120 పాయింట్ల లాభంలో SGX నిఫ్టి

ఉక్రెయిన్‌, రష్యా మధ్య చర్చల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో రిలీఫ్‌ కన్పిస్తోంది. డాలర్‌ పెరిగింది. క్రూడ్‌ తగ్గింది. ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి వాల్‌స్ట్రీట్‌ ఆరంభంలో నష్టాల్లో ఉన్నా… మిడ్‌ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చేసింది. నాస్‌డాక్‌ మళ్ళీ జోరందుకుంది. 1.31 శాతం లాభంతో ముగిసింది. ఐటీ, టెక్‌ షేర్ల జోరు ప్రభావం ఎస్‌ అండ్‌ పీ 500పైన కూడా పడింది. ఈ సూచీ 0.71 శాతం లాభపడింది. ఇక డౌజోన్స్‌ కూడా 0.27 శాతం లాభంతో ముగిసింది. రాత్రి ఎనర్జీ షేర్లపై ఒత్తిడి కారణంగా ఈ సూచీ లాభాలు పరిమితంగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు అర శాతంపైగా లాభాల్లో ఉండటం విశేషం. హాంగ్‌ సెంగ్‌ 0.67 శాతం, జపాన్‌ నిక్కీ 0.63 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లోఉన్నా షాంఘై మాత్రం స్థిరంగా ఉంది. సింగపూర్‌ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. మన మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.