అరబిందో చేతికి వెరిటాజ్ హెల్త్‌కేర్
హైదరాబాద్‌కు చెందిన జనరిక్ ఫార్ములేషన్ల కంపెనీ వెరిటాజ్ హెల్త్‌కేర్‌కు చెందిన వ్యాపారాన్ని, కొన్ని ఆస్తులను రూ.171 కోట్లకు అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మొత్తం మే నాటికి పూర్తవుతుందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. వెరిటాజ్ హెల్త్‌కేర్ బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్లు, ఇతర హెల్త్‌కేర్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ కంపెనీ చేతిలో 180 ట్రేడ్ మార్క్‌లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 40 ట్రేడ్ మార్క్‌ల ద్వారా జనరిక్ ఔషధాలను విక్రయిస్తోంది. భారత్‌లో బయోసిమిలర్లు, ఇతర ఔషధాలను ప్రవేశపెట్టడానికి అరబిందోకు వెరిటాజ్ ఒక వేదికగా ఉపయోగడుతుంది.