పీవీఆర్, ఐనాక్స్ విలీనం ఖరారు
సినీ మల్టిప్లెక్స్ కంపెనీలైన పీవీఆర్, ఐనాక్స్‌ల విలీనం ఇవాళ భేటీ అయిన రెండు కంపెనీల బోర్డులు విలీనానికి ఆమోదం తెలిపాయి. విలీన నిష్పత్తి ప్రకారం ఐనాక్స్కు చెందిన ప్రతి పది షేర్లకు పీవీఆర్ సినిమాస్‌కు చెందిన మూడు షేర్లను ఇస్తారు విలీనం తరవాత కొత్త కంపెనీ పేరు పీవీఆర్ ఐనాక్స్‌గా మారుస్తారు. విలీనం తరవాత ఐనాక్స్కు చెందిన ప్రమోటర్లు.. కొత్త కంపెనీలో కో ప్రమోటర్స్‌గా ఉంటారు. కొత్త కంపెనీకి అజయ్ బిజ్లి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటారు. ఈ రెండు కంపెనీలవిలీనంతో రూ. 16,000 కోట్లతో కొత్త కంపెనీ ఏర్పడుతుందన్నమాట. గత శుక్రవారం పీవీఆర్ షేర్ రూ. 1804 వద్ద ముగిసింది. ఐనాక్స్ లీజర్ షేర్ కూడా రూ. 470 వద్ద ముగిసింది. పీవీఆర్ వద్ద 860 స్క్రీన్స్ ఉండగా, ఐనాక్స్ వద్ద 675 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే కొత్త కంపెనీ చేతిలో 1,535 స్క్రీన్స్ ఉంటాయి.