For Money

Business News

మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీ తెరచుకుంది

దాదాపు నెల రోజుల తరవాత భారీ ఆంక్షల మధ్య మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఇవాళ తెరచుకుంది. కేవలం షేర్లలో సాధారణ లావాదేవీలు మినహా… షార్ట్‌ సెల్లింగ్‌కు అనుమతించలేదు. ఉక్రెయిన్‌పై దాడి.. ఆ వెంటనే పాశ్చాత్య దేశాల ఆంక్షలతో మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో షేర్ల ధరలు కుప్పకూలాయి. అనేక మంది పారిశ్రామిక వేత్తలు బికారీలు అయ్యారు. దీంతో వెంటనే ఎక్స్ఛేంజీని మూసేశారు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలైన గజప్రామ్‌, రాస్‌నాఫ్ట్‌ షేర్లలో మాత్రం కఠిన ఆంక్షలతో ఇన్నాళ్ళూ ట్రేడింగ్ జరిగింది. ఇపుడు తమ దేశం నుంచి క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌ కొనుగోలు చేసిన దేశాలు రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలని రష్యా దేశించింది. దీంతో రూబుల్ విలువ కాస్త పెరిగింది. అయితే ఇలాంటి తాత్కాలిక చర్యలతో స్టాక్‌ మార్కెట్‌ నడుస్తుందా?