జీ టీవీ 20 శాతం జంప్
జీ ఎంటర్టైన్మెంట్ షేర్ ఇవాళ 20 శాతం పెరిగి రూ.307.25ని తాకింది. ప్రస్తుతం 17.38 శాతం లాభంతో రూ. 300.55 వద్ద ట్రేడవుతోంది. నిన్న రూ. 256 వద్ద ముగిసిన జీ షేర్ నిన్న సాయంత్రం ఇన్వెస్కో ఆపర్య్చునిటీ ఫండ్ చేసిన ప్రకటనతో కంపెనీ షేర్ భారీ లాభాలతో ప్రారంభమైంది. తొలి పది శాతం, ఆ తరవాత అయిదు శాతం సీలింగ్‌ని తాకింది. 10.45 గంటలకు మరోసారి అయిదు శాతం సీలింగ్‌ను తాకి ఇపుడు 17.38 శాతం లాభంతో ట్రేడవుతోంది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్కో అతి పెద్ద వాటా ఉన్న ఇన్వెస్టర్. ఈ సంస్థ కోర్టుకు వెళ్ళడంతో జీ-సోనీ డీల్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఇవాళ ఇన్వెస్కో క్లారిటీ ఇచ్చింది. జీ సీఎండీ పునీత్ గోయెంకాను తొలగించేందుక ఈజీఎం నిర్వహించాలన్న తమ నోటీసును కొనసాగిస్తామని… జీ – సోనీ డీల్ అమలును పరిశీలిస్తామని ఇన్వెస్కో పేర్కొంది. ఒప్పందం సక్రమంగా అమలైతే తాను కోర్టును ఆశ్రయించనని పరోక్షంగా ఇన్వెస్కో పేర్కన్నట్లయింది. దీంతో ప్రస్తుతానికి జీ షేర్‌కు ఇబ్బందులు తగ్గినట్ల ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మరోవైపు డీష్ టీవీ షేర్ కూడా ఆరు శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది.