For Money

Business News

నిఫ్టి బ్యాంక్‌ నుంచి భారీ ఒత్తిడి

ఇవాళ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 4 కోట్ల షేర్ల బ్లాక్‌ డీల్ ఉంది. దీంతో ఆ షేర్‌ నాలుగు శాతం వరకు నష్టపోయింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా ఇదే స్థాయి నష్టాలతో ఉంది. దీంతో సింగపూర్ నిఫ్టికి భిన్నంగా భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17091కి పడిన నిఫ్టి ఇపుడు 17139 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టికి రెట్టిపుగా బ్యాంక్‌ నిఫ్టి 1.33 శాతం నష్టపోయింది. నిఫ్టి మిడ్ క్యాప్‌ షేర్ల సూచీ గ్రీన్‌లో ఉండటం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా పెద్ద ఒత్తిడి లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిడితో పాటు మన మార్కెట్ల వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌ కారణంగా మార్కెట్‌లో ఒత్తిడి అధికంగా ఉంది. చాలా వరకు మార్కెట్‌ నిఫ్టి ప్రధాన షేర్లకే పరిమితం కావొచ్చు. బ్లాక్‌డీల్‌ తరవాత కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏమాత్రం కోలుకుంటుందో చూడాలి. దాన్ని బట్టి బ్యాంక్‌ నిఫ్టి పతనం ఆధారపడి ఉంది.