For Money

Business News

NIFTY TRADE: 17132 దిగువకు వెళితే…

నిన్న ద్వితీయార్థంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చారు. 17300, 17400, 17500 ప్రాంతాల్లో భారీగా కాల్ రైటింగ్‌ చేశారు. అధిక ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 17300 ప్రాంతంలో ఉండటం విశేషం. కాని పుట్‌ రైటింగ్‌లో ఓపెన్‌ ఇంటరెస్ట్‌ బాగా తగ్గింది. పుట్‌ రైట్‌ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు అనే కాంట్రాక్ట్‌లను క్లోజ్‌ చేశారు. నిఫ్టి ఎక్కడ దాకా పడుతుందనే అంశంపై వారికి స్పష్టమైన అవగాహన లేనందునే పుట్‌ రైటింగ్‌ తగ్గించినట్లు డేటా అనలిస్ట్ వీరందర్‌ అంటున్నారు. అందుకే నిఫ్టి 17177-132 స్థాయిని కోల్పోతే నిఫ్టిని షార్ట్‌ చేయమని సలహా ఇస్తున్నారు. అదే జరిగితే అంటే నిఫ్టి దిగువకు వస్తే 17051 లేదా 16985 స్థాయిని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఇక పెరిగితే 17333 పాయింట్ల వద్ద తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. ఈ స్థాయిని దాటితే 17376 స్థాయిని తాకవచ్చు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ సెటిల్‌మెంట్‌ కాబట్టి నిఫ్టి హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు.

https://www.youtube.com/watch?v=F8XfCsluZTM