For Money

Business News

NIFTY TODAY: ఓపెనింగ్‌లోనే మద్దతు

ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నా… పరిస్థితి మరీ దారుణంగా లేదు. క్రూడ్‌ ఆయిల్ ధరలు 123 డాలర్లను దాటడంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. రాత్రి అమెరికా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థాయిలో మార్కెట్‌ ప్రారంభమైతే నిఫ్టికి ఓపెనింగ్‌లోనే మద్దతు లభించే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న క్యాఫ్‌ మార్కెట్‌లో స్వల్పంగా నికర కొనుగోళ్ళు చేసినా… ఫ్యూచర్స్‌లో భారీ అమ్మకాలు చేశాయి. అధిక స్థయిలో కాల్‌ రైటింగ్‌ సాగుతోంది. అంటే మార్కెట్‌ పెరిగే అవకాశాలు తగ్గుతున్నాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. డే ట్రేడర్లకు ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టి లెవెల్స్‌ ఇవి…

అప్‌ బ్రేకౌట్‌ 17396
రెండో ప్రతిఘటన 17356
తొలి ప్రతిఘటన 17329
నిఫ్టి కీలక స్థాయి 17296
తొలి మద్దతు 17160
రెండో మద్దతు 17135
డౌన్‌ బ్రేకౌట్‌ 17096

నిఫ్టి ఓవర్‌బాట్ ప్రాంతంలో ఉంది. సాంకేతికంగా సెల్‌ సిగ్నల్స్‌ ఉన్నా… దిగువ స్థాయిలో బై సిగ్నల్‌ ఇస్తున్నాయి.