పేటీఎంకు స్టాక్ఎక్స్ఛేంజీ తాకీదు
వరుసగా క్షీణిస్తున్న కంపెనీ షేరుపై పేటీఎం మాతృ సంస్థ అయిన One 97 Communications Ltd నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) వివరణ కోరింది. కంపెనీ షేరు భారీగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే నిమిత్తం, అసలు కంపెనీలో ఏం జరుగుతోంది? కంపెనీకి సంబంధించి తాజా సమాచారం ఏమిటో తెలపాల్సిందిగా ఇవాళ లేఖ రాసింది. ఒక కంపెనీ నుంచి ఇలాంటి వివరణను బీఎస్ఈ కోరడం స్టాక్ మార్కెట్ చరిత్రలో చాలా అరుదు. కంపెనీ షేర్ ఇష్యూ ధరలో నాలుగో వంతుకు పడిపోయినా… కంపెనీ షేర్లో భారీ మార్పు ఉందని బీఎస్ఈ కోరడం వెనుక ఉద్దేశం తెలియడం లేదు. పేటీఎం షేర్ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి రూ.543.90కు పడిపోయిన విషయం తెలిసిందే.