హౌసింగ్ ధరలు… భారత్కు 51వ ర్యాంకు
ఇంటి ధరల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరో అయిదు మెట్లు ఎక్కింది. 2021 చివరి త్రైమాసికంలో అంతర్జాతీయ గృహ ధరల సూచీ (Global House Price Index)లో భారత్ 51వ స్థానానికి చేరింది. ఇంతకుముపు 56వ స్థానంలో అంటే చిట్టచివరి స్థానంలో ఉండేది. ఏటా 56 దేశాల్లో నివాస గృహాల ధరలను బట్టి ఈ ర్యాంకు ఇస్తున్నారు. అక్టోబర్ -డిసెంబర్ మధ్య కాలంల భారత దేశంలో హౌసింగ్ ధరలు 2.1 శాతం పెరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ పేర్కొంది. 2020లో ఇదే కాలంలో భారత్ ర్యాంక్ 56 కాగా, ఇపుడు 51కి చేరిటన్లు ఆ సంస్థ వెల్లడించింది. టర్కీలో గృహాల ధరలు 59.6 శాతం పెరగడంతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో న్యూజిల్యాండ్ (22.6 శాతం), చెక్ రిపబ్లిక్ (22.1 శాతం), స్లోవకియా (22.1 శాతం) ఆస్ట్రేలియాలో (21.8 శాతం) చొప్పున ఇంటి ధరలు పెరిగాయి.