For Money

Business News

ఎంతెంత పతనం? ఇంకెంత పతనం?

నవంబర్ 18, 2021
పేటీఎం లిస్టింగ్‌.
ఇష్యూ ధర రూ. 2150.
లిస్టింగ్‌ రోజు క్లోజింగ్‌ ధర రూ.1955.
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.38 లక్షల కోట్లు

మార్చి 22
పేటీఎం షేర్‌ క్లోజింగ్‌ ధర రూ. 543.50
(నిజానికి ఇంట్రా డేలో ఈ షేర్‌ రూ.540.35ని తాకింది)
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 35,247 కోట్లు…
….
కేవలం నాలుగు నెలల్లో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా 75 శాతం క్షీణించింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్ల షేర్ల విలువ రూ. 1.03 లక్షల కోట్లు తగ్గిందన్నమాట. రూ. 2150లకు ఆఫర్‌ చేసిన ఈ షేర్‌ లిస్టింగ్‌ రోజున రూ. 1961కి చేరింది.(ఇంట్రా డేలో) అంటే మళ్ళీ ఇన్వెస్టర్లు ఆఫర్‌ ధరను చూడకపోగా… నమ్ముకుని ఉంచుకున్నవారు నట్టేట మునిగిపోయారు. ఆరంభంలో ఈ కంపెనీనికి ఆకాశానికెత్తిన బ్రోకర్లు… తరవాత చెంపలేసుకున్నారు. మరి ఈ కంపెనీ వ్యాల్యూయేషన్‌ లెక్కించిన బ్యాంకర్లపై సెబీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోనీ… ఈ స్థాయిలోనైనా ఈ షేర్‌ విలువ అంటే చెప్పే దిక్కులేదు. గతంలో ఒక్రటెండు రీసెర్చి సంస్థలు ఈ షేర్‌ వ్యాల్యూను తగ్గించి… టార్గెట్‌ ఇచ్చారు. ఆ టార్గెట్లను కూడా కాదని… క్షీణిస్తోంది ఈ షేర్‌. తాజాగా ఓ సంస్థ ఈ షేర్‌ టార్గెట్‌ రూ.480గా పేర్కొంది. చూస్తుంటే ఆ స్థాయి దిగువకు కూడా వచ్చేసేలా ఉంది. ఈ కంపెనీ షేర్‌ జోలికి వచ్చేందుకు రీసెర్చి సంస్థలు కూడా ఇపుడు జంకుతున్నాయి. దీంతో ఈ షేర్‌ విలువ గాలిలో దీపంలో మారింది.