నిఫ్టికి యూరో మార్కెట్ల మద్దతు
అమెరికా మార్కెట్లకు అనుగుణంగా ఆరంభం నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్లకు యూరో మార్కెట్ల నుంచి గట్టి మద్దతు అందింది. ఉదయం హాంగ్‌సెంగ్, నిక్కీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న సెలవు కారణంగా ఇవాళ నిక్కీ లాభాల్లో ముగిసింది. ఇక చైనా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. అమెరికాలో చైనా కంపెనీల షేర్లు పెరగడంతో హాంగ్‌సెంగ్ సూచీ పెరిగింది. ఇక మన మార్కెట్లు మాత్రం నిన్న అమెరికా మార్కెట్లకు అనుగుణంగా నష్టాల్లో ప్రారంభమై 17006కి క్షీణించింది. దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందింది. అక్కడి నుంచి ఏకంగా 330 పాయింట్లు కోలుకుంది నిఫ్టి. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన మార్కెట్లు స్వల్ప లాభాల నుంచి ఒక శాతంపైగా లాభాల్లోకి చేరుకున్నాయి. దీంతో మన నిఫ్టి కూడా గరిష్ఠ స్థాయి వద్దే ముగిసింది. 17315 పాయింట్ల వద్ద నిఫ్టి క్లోజ్‌గా, క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 198 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా భారీ నష్టాల నుంచి నిఫ్టి బ్యాంక్ కోలుకోవడం కూడా ఒక కారణం. అనేక బ్యాంక్ షేర్లు ఇవాళ్టి స్థాయి నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ కూడా 697 పాయింట్ల లాభంతో 57989 వద్ద ముగిసింది.