నిఫ్టి పడే ఛాన్స్ ఎక్కువ
ఇపుడు మార్కెట్‌లో నెగిటివ్స్ అధికంగా ఉన్నాయని, నిఫ్టి క్షీణించే అవకాశాలే అధికంగా ఉన్నాయని స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు మానస్ జైస్వాల్ అంటున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ డైలీ ఛార్ట్ చూస్తే నిఫ్టికి 17,400 వరకు గట్టి ప్రతిఘటన ఉందని, ఈ స్థాయిని బ్రేక్ చేస్తేగానికి నిఫ్టిలో కొనుగోలుకు ఛాన్స్ లేదని ఆయన అన్నారు. నిఫ్టిలో నెగిటివ్స్ అధికంగా ఉన్నాయని అంటున్నారు మనస్ జైస్వాల్. నెగిటివ్ ప్యాటర్న్‌లు నిఫ్టిలో అధికంగా ఉన్నాయన్నారు. 16,990 దాకా నిఫ్టి క్షీణించే అవకాశముందని…ఇంకా బలహీనపడితే మరింత దిగువకు వెళ్ళే అవకాశముంది. 17145 స్టాప్‌లాస్‌తో 17,090 దిగువన నిఫ్టిని సెల్ చేయమని మనస్ జైస్వాల్ సలహా ఇస్తున్నారు. ఇది నిన్నటి కనిష్ఠ స్థాయి. తొలి లక్ష్యం 17,000అని ఆయన అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే నిఫ్టి 16,930ని కూడా చేరుతుందని అన్నారు. ఇక పెరిగితే నిఫ్టికి 17,250 లేదా 17,280 వద్ద ప్రతిఘటన ఉంటుందని అన్నారు. 17,220ని స్టాప్‌లాస్‌గా 17,280 దాటితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. లక్ష్యం 17400 అని చెప్పారు. నిఫ్టి ప్యాటర్న్ చూస్తుంటే … మార్కెట్ పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని మానస్ జైస్వాల్ అంటున్నారు.
https://www.youtube.com/watch?v=GPV_TVmvfUs