For Money

Business News

NIFTY TRADE: 17,048 పైన నో షార్టింగ్‌

17,048 పైన ఉన్నంత వరకు నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని సలహా ఇస్తున్న డేటా అనలిస్ట్‌ వీరేందర్ కుమార్. ఇది 50 DEMA (Day Exponential Moving Average) స్థాయి కావడమే ఈ సలహా కారణం. ఈ స్థాయి దిగువకు వస్తే కచ్చితంగా నిఫ్టిని షార్ట్‌ చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఈ స్థాయి వద్ద నిఫ్టికి మద్దతు లభించవచ్చని లేదంటే 16987 వద్ద మద్దతు లభిస్తుందని ఆయన అంటున్నారు. ఇంకా క్షీణిస్తే 16879 నుంచి 16829 (100 DEMA)దాకా పడే అవకాశముంది. 14 సెషన్స్‌ తరవాత మార్కెట్‌ నీరసపడినట్లు ఆయన భావిస్తున్నారు. ఇపుడు నిఫ్టి కన్సాలిడేషన్‌లో ఉందని ఆయన అంటున్నారు. పెరిగితే 17215, 17276 వద్ద ప్రతిఘటన వచ్చే అవకావముందని వీరేందర్‌ అంటున్నారు.ఈ స్థాయిలను దాటితే 17347, 17382 వద్ద ఒత్తిడి వచ్చే అవకావముంది. ఇతర వివరాలకు ఈ వీడియో చూడండి.