For Money

Business News

NIFTY TODAY: 17190 కీలకం

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా నష్టాల్లో క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్, నిక్కీ. నిఫ్టి క్రితం ముగింపు 17,117. ఇక్కడి నుంచి నిఫ్టి పెరిగే కొద్దీ అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి మార్కెట్‌ను ఇబ్బంది పెట్టే అవకాశముంది. కంపెనీల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నిఫ్టి ఇవాళ్టి ట్రేడింగ్‌కు కీలక లెవల్స్‌ ఇవే…

అప్‌ బ్రేకౌట్‌ 17275
రెండో ప్రతిఘటన 17233
తొలి ప్రతిఘటన 17205
నిఫ్టి కీలక స్థాయి 17189
తొలి మద్దతు 17030
రెండో మద్దతు 17002
డౌన్‌ బ్రేకౌట్‌ 16960