నష్టాల్లోనే నిఫ్టి
ఉదయం కొద్దిసేపు లాభాల్లో ఉన్న నిఫ్టి… మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉంది. యూరో ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో మిడ్ సెషన్ సమయానికి నిఫ్టి 122 పాయింట్ల నష్టంతో 17164 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అత్యధికంగా నిఫ్టి బ్యాంక్ నష్టాల్లో ఉంది. రెండు బ్యాంకు షేర్లు నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన బ్యాంకు షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. దాదాపు సూచీలన్నీ అర శాతంపైనే లాభంతో ఉన్నాయి. అయితే ప్రారంభమయ్యే సమయానికి యూరప్ మార్కెట్ల నష్టాలు బాగా తగ్గే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు కూడా తగ్గాయి. మరి నిఫ్టి క్లోజింగ్ సమయానికి కోలుకుంటుందేమో చూడాలి.