For Money

Business News

క్షణాల్లో నష్టాలోకి…

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి చాలా బలహీనంగా ప్రారంభమైంది. 17,329 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 17353కి చేరినా.. కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 17267కు అంటే దాదాపు వంద పాయింట్లు క్షీణించిన నిఫ్టి ఇపుడు 17,269 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపు పోలిస్తే నిఫ్టి 17 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే నిఫ్టి స్థిరంగా ఉంది. బల్క్ డీజిల్‌ ధరలు పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు పెరగడంతో ఏషియన్‌ పెయింట్‌ భారీగా క్షీణించింది. యాక్సెంచురా ఫలితాలు బాగుండటంతో ఐటీ షేర్లలో ఆసక్తి కన్పిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని ఆటో, మెటల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి కంటే ఇతర సూచీలు అధిక నష్టాలతో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు 0.3 శాతంపైగా నష్టంతో ఉన్నాయి. అయితే మార్కెట్‌కు ఇవన్నీ నామమాత్రపు నష్టాలే. మరి మార్కెట్‌ మరింతగా క్షీణిస్తుందా, లాభాల్లోకి వస్తుందా అన్నది చూడాలి.