అరబిందో ఇంజెక్టబుల్స్ బ్లాక్‌స్టోన్ చేతికి?
తన ఇంజెక్టబుల్ బిజినెస్‌ను అరబిందో ఫార్మా అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ స్టోన్ కంపెనీ ఈ వ్యాపారాన్ని కొనేందుకు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో బ్లాక్‌స్టోన్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఎకనామిక్ టైమ్స్ రాసింది. ఇంజెక్టబుల్ బిజినెస్ విభాగం విలువ రూ.26,000 కోట్ల నుంచి రూ. 30,000 కోట్లు ఉండొచ్చని పేర్కొంది. ఇందులో 51 శాతం లేదా 55 శాతం వాటాను బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసే అవకాశముంది. అంటే ఈ వాటా కోసం రూ. 15,750 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ డీల్ కుదిరితే ఇటీవల కాలంలో ఫార్మా రంగంలో ఇదే పెద్ద డీల్‌గా పేర్కొనవచ్చు. బ్లాక్‌స్టోన్‌తో పాటు బారింగ్ ప్రైవేట్ ఈక్విటీ కూడా ప్రయత్నిస్తోంది. అరబింద్ కంపెనీ తన వ్యాపారాన్ని రెండు భాగాలు చేసి…ఇంజెక్టబుల్ బిజినెస్‌ను విడగొట్టి.. అందులో వాటాను అమ్మాలని భావిస్తోంది. అమ్మకం ప్రక్రియ ఏప్రిల్ నెలలో ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అరబిందో ఫార్మా టర్నోవర్‌లో ఇంజెక్టబుల్ బిజినెస్ ద్వారా 15 శాతం వస్తోంది. కంపెనీలో ప్రమోటర్లు వి రామ్‌ప్రసాద్ రెడ్డి, కె నిత్యానంద రెడ్డిలకు 51.8 శాతం వాటా ఉంది.48.2 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు ఉంది.