For Money

Business News

ఈ రెండు షేర్లు కొంటారా?

రెండు లేదా మూడు వారాల పాటు ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు రెండు షేర్లు ఏంజిల్‌ వన్‌ సంస్థకు చెందిన టెక్నికల్‌ చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చవాన్‌ సిఫారసు చేస్తున్నారు. మనీ కంట్రోల్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ… రాడికో ఖైతాన్‌, SPIC షేర్లను సిఫారసు చేశారు. రాడికో ఖైతాన్‌ క్రితం ముగింపు రూ. 963.45 కాగా రూ. 912 స్టాప్‌లాస్‌తో రూ. 1020 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఇటీవల భారీగా క్షీణించిన పలు షేర్లు ఇపుడు యూ టర్న్‌ తీసుకుంటున్నాయి. రూ.800లకు పడిన రాడికో ఖైతాన్‌ ఇపుడు మళ్ళీ పుంజుకునేందుకు సిద్ధమైంది. గత గురువారం ఈ కంపెనీ షేర్‌ పెరగడం ప్రారంభమైందని సమీత్‌ చవాన్‌ తెలిపారు. ఈ షేర్‌ బ్రేకౌట్‌తో పాటు భారీ వ్యాల్యూమ్ కూడా ఉందని… అంటే ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ షేర్‌ రూ.955-950 ప్రాంతంలో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
ఇక ఆయన రెకమెండ్‌ చేసిన మో షేర్‌ స్పిక్‌ (Southern Petrochemicals Industries Corporation -SPIC). ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 63.15 కాగా, రూ. 59 స్టాప్‌లాస్‌తో రూ. 70 టార్గెట్‌కు కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. ఇటీవల ఫర్టిలైజర్ షేర్లకు మార్కెట్‌లో ఆసక్తి పెరుగుతోంది. గత కొన్ని ఏళ్ళలో ఈ కంపెనీ ఎరువుల రంగంలో బాగా రాణిస్తోందని అన్నారు. ఇటీవల మార్కెట్‌ భారీగా క్షీణించినా… ఎరువుల రంగానికి చెందిన షేర్లు స్థిరంగా నిలబడ్డాయి. ఇపుడు పెరగడానికి సిద్ధమౌతున్నాయని సమీత్‌ అంటున్నారు.