స్థిరంగా వాల్‌స్ట్రీట్

ఆరంభంలో నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్ ఇపుడు స్థిరంగా దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. నాస్‌డాక్ రెడ్‌లో ఉన్నా నామమాత్రపు నష్టాలే. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ, డౌజోన్స్ సూచీలు గ్రీన్‌లో ఉన్నా చెప్పుకోదగ్గ లాభాలు కాదు. జాబ్ డేటా మార్కెట్ అనుకూలంగా ఉంది. అలాగే హౌసింగ్ సేల్స్ డేటా కూడా పాజిటివ్‌గా ఉంది. ఫెడ్ నిర్ణయం తరవాత మార్కెట్‌లో ఉత్సాహం తగ్గింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ భారీగా క్షీణించింది. 0.72 శాతం నష్టంతో డాలర్ ఇండెక్స్ 97.91కి పడింది. యుద్ధానికి సంబంధించి సందిగ్ధం ఇంకా కొనసాగుతోంది.