17300స్థాయిని తాకిన నిఫ్టి
యూరో మార్కెట్లు కూడా గ్రీన్లో ప్రారంభం కావడంతో నిఫ్టి 17300 స్థాయిని దాటి 17329కి చేరింది. ఉదయం నుంచి ట్రేడింగ్ కొనసాగే కొద్దీ నిఫ్టి మరింత బలపడుతూ వచ్చింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ కావడంతో భారీ ఎత్తున షార్ట్ కవరింగ్ వచ్చింది. మరి మిడ్ సెషన్ తరవాత ఇదే ఊపు కన్పిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే యూరో మార్కెట్ల లాభాలు పరిమితంగా ఉన్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా. క్రూడ్ ఆయిల్ మళ్లీ 100 డాలర్లను దాటింది. మార్కెట్కు రేపు సెలవు కావడంతో… మళ్ళీ మార్కెట్ సోమవారమే. కాబట్టి ట్రేడింగ్ చివర్లో వొత్తిడి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి నిఫ్టి 316 పాయింట్ల లాభంతో 17292 వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలకన్నా నిఫ్టి ఫైనాన్షియల్స్ 2.72 శాతం లాభపడింది.