ఒక్క రూపాయితో ‘క్రిప్టో’లో సిప్
మనదేశంలో కూడా క్రిప్టో కరెన్సీల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి చూపుతున్నారు. నెలవారీ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరినట్లు జియోటస్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడికి సిప్ (Systematic Investment Plan -SIP)ను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. ఒక్క రూపాయితో సిప్ ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు. గంట, రోజు, వారం, నెలవారీగా సిప్ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేవారి కోసం బాస్కెట్స్ ఉన్నాయని చెప్పారు. ఈ రంగంలో నిపుణులైన వారు ఈ బాస్కెట్‌ను రూపొందిస్తారని, దీనిని రూ. 100 పెట్టుబడితో ప్రారంభించవచ్చని తెలిపారు. ‘బాస్కెట్స్’ పేరుతో వివిధ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు తమ వద్ద ఉందని చెప్పారు. ప్రాంతీయ భాషల్లోనే క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలు చేయడానికి 8 భాషల్లో జియోటస్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. 2020లో ప్రారంభించిన జియోటస్‌కు 10 లక్షల మంది ఖాతాదారులుండగా వారిలో 30 శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనే ఉన్నారు. దేశంలో 12 ఎక్స్ఛేంజీలు..దేశీయంగా క్రిప్టోకరెన్సీల కోసం 12 ఎక్స్ఛేంజీలు ఉన్నాయని.. ఇందులో మొదటి 5 ఎక్స్ఛేంజీలలోనే 90 శాతం ట్రేడింగ్ జరుగుతోందని విక్రమ్ అన్నారు.