For Money

Business News

100 డాలర్లకు దిగువన క్రూడ్‌

ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పతనమౌతోంది క్రూడ్‌ ఆయిల్‌. నిన్న 9 శాతం దాకా క్షీణించిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇవాళ కూడా 7.6 శాతం క్షీణించి 98.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చైనాలో కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో చైనా నుంచి క్రూడ్‌ డిమాండ్‌ తగ్గింది. అలాగే ఇరాన్‌, యూఏఈ దేశాలు తాము సరఫరా పెంచుతామని పేర్కొన్నారు. ఒపెక్‌ కూడా సరఫరా పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో క్రూడ్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇదే సమయంలో డాలర్‌ ఇవాళ కూడా క్షీణించింది. దీంతో భారత్ వంటి వర్ధమాన దేశాల క్రూడ్‌ దిగమతి బిల్లు బాగా తగ్గే అవకాశముంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆగితే క్రూడ్‌ తన వాస్తవ రేటుకు వస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు. యుద్ధ భయంతో క్రూడ్‌ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.