MID REVIEW: యూరో వైపు చూపు
ఉదయం ఆరంభంలో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి… తరవాత స్థిరంగా పెరుగుతూ వచ్చింది.16,633 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొద్దిసేపు లాభాల్లో ఉన్నా …అర గంటకే నష్టాల్లోకి వెళ్ళింది. 16606ను తాకిన తరవాత క్రమంగా బలపడుతూ వచ్చి 16,786కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 140 పాయింట్ల లాభంతో16771 పాయింట్ల వద్ద ఇపుడు ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి లాభాల కారణంగా నిఫ్టి నిలబడింది. పైగా ఐటీ కౌంటర్ల నుంచి కూడా మద్దతు అందుతోంది. మిడ్ క్యాప్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్ సూచీలు మాత్రం నష్టాలతో ట్రేడవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బై, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నిఫ్టి గెయినర్స్‌లో ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో ఐఓసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. జూబ్లియంట్ ఫుడ్ 13 శాతం దాకా నష్టంతో ఉండగా, పేటీఎం 11 శాతం నష్టంతో రూ. 694 వద్ద ట్రేడవుతోంది. అంతకుమునుపు పేటీఎం రూ. 672ను కూడా తాకింది. ప్రస్తుతానికి యూరో ఫ్యూచర్స్, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. యూరో మార్కెట్లు ప్రారంభమైన తరవాత ట్రెండ్‌లో మార్పు రావొచ్చు.