For Money

Business News

రిలయన్స్‌ క్యాపిటల్‌ రేసులో అదానీ

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రుణదాతలు ఈ కంపెనీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు అదానీ గ్రూప్‌ సంస్థ ‘అదానీ ఫిన్‌సర్వ్‌’తో పాటు కేకేఆర్‌, పిరామల్‌ ఫైనాన్స్‌, పూనా వాలా ఫైనాన్స్‌ వంటి 14 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ (Expression of Interest – EoI) సమర్పించాయి. దాదాపు రూ.40,000 కోట్ల అప్పు లతో దివాలా తీసిన అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిల యన్స్‌ క్యాపిటల్‌ బోర్డును ఆర్‌బీఐ నవంబరులో రద్దు చేసింది. కంపెనీ అమ్మక ప్రక్రియను చూసేందుకు బోర్డు స్థానంలో నాగేశ్వర రావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఈ కంపెనీ ఆస్తుల అమ్మకం కోసం అడ్మినిస్ట్రేటర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో బిడ్స్‌ ఆహ్వానిం చారు. ఈ నెల 11న ఈ బిడ్డింగ్‌ ముగిసినా… కొన్ని సంస్థల విజ్ఞప్తితో మేరకు తుది గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. మరి ఇంకెన్ని సంస్థలు బరిలోకి దిగుతాయో చూడాలి.