For Money

Business News

ఎఫ్‌పీవోకి రుచి సోయా

పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో)కి రాబోతున్నది. కంపెనీలో యజమానులకు దాదాపు 99 శాతం వాటా ఉంది. సెబి నిబంధనల మేరకు క్రమంగా దీన్ని 75 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొంత ఈక్విటీని పతంజలి గ్రూప్‌ విక్రయిస్తోంది. ఈ నెల 24 నుంచి ఈ ఎఫ్‌పీవో ప్రారంభమౌతుంది. రూ. 4350 కోట్లను సమీకరించాలని రుచి సోయా భావిస్తోంది. ఈ ఎఫ్‌పీఓ తరవాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 99 శాతం నుంచి 90 శాతానికి తగ్గుతుంది.