For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ డౌన్‌…ఆయిల్‌ అప్

ఉక్రెయిన్‌,రష్యా యుద్ధంతో పాటు వడ్డీ రేట్ల పెంపు ప్రతిపాదన ఈక్విటీ మార్కెట్లపై ఇంకా ప్రభావం చూపుతున్నాయి. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసిందని విశ్లేషకులు అంటున్నా… ఇన్వెస్టర్లు మాత్రం అమ్ముతూనే ఉన్నాయి.రాత్రి వాల్‌స్ట్రీట్‌లో మూడు సూచీలూ నష్టాల్లో ముగిశాయ. డౌజోన్స్‌ నష్టాలు 0.69శాతమే కాగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 1.3 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 2.18 శాతం నష్టపోవడం విశేషం. ఇక రాత్రి కరెన్సీ మార్కెట్‌లో ఊహించినట్లే డాలర్ ఇండెక్స్ 99ని దాటేసింది. దీంతో బులియన్‌ ధరలు స్వల్ప తగ్గినా… ఆయిల్‌ రేట్లు మాత్ర తగ్గలేదు. రాత్రి బ్రెంట్‌ క్రూడ్‌ 3 శాతంపైగా పెరిగి 112.7 డాలర్ల వద్ద ముగిసింది.