For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

రోజంతా తీవ్ర హెచ్చతగ్గులకు లోనైన నిఫ్టి స్థిరంగా ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 35 పాయింట్ల లాభంతో 16630 వద్ద ముగిసింది. ఉదయం ఆరంభంలోనే 16,470 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 16694 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి… పలు మార్లు లాభానష్టాల్లోకి వచ్చి వెళ్ళింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా స్థిరంగా ఉండటంతో నిఫ్టి చివర్లో లాభాల్లోనే కొనసాగింది. అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ అర శాతంపైగా లాభంతో ముగిసింది. చివరల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీలు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. సోమవారం లోపల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను పెంచుతారన్న వదంతులు మార్కెట్‌లో ఉన్నాయి. ఇవాళ టాప్‌ లూజర్స్‌లో నెస్లే టాప్‌లో ఉంది.