రూ. 53,000పైన బంగారం
ఇవాళ మళ్ళీ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరగడంతో బులియన్, క్రూడ్ పెరిగాయి. వీటితోపాటు డాలర్ కూడా పెరిగింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ 0.43 శాతం పెరిగింది. డాలర్ ఇండెక్స్ 98.39 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 111.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఔన్స్ బంగారం ధర అమెరికా మార్కెట్‌లో 2000 దాటింది. వెండి రెండు శాతం పెరిగింది. అమెరికా మార్కెట్‌లో బంగారం పెరుగుదల తక్కువైనా.. డాలర్ బలం కారణంగా మన మార్కెట్‌లో అధికంగా పెరిగింది. ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీలో పది గ్రామలు స్టాండర్డ్ బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ.389 పెరిగి రూ. 53134 వద్ద ట్రేడవుతోంది. కొద్ది సేపటి క్రితం 53488ని కూడా తాకింది. ఇక వెండి కూడా రూ.755 పెరిగి రూ. 70,330 వద్ద ట్రేడవుతోంది.