నిఫ్టి: ఒత్తిడి ఉన్నా… లాభాలే
వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా స్క్వేర్ ఆఫ్ సమయంలో కాస్త ఒత్తిడి వచ్చినా… భారీ లాభాల్లో నిఫ్టి ముగిసింది. ప్రధానంగా అన్నిరంగాల షేర్ల నుంచి మద్దతు అందడంతో నిఫ్టి16,594 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 249 పాయింట్లు లాభంతో ముగిసింది. స్క్వేర్ ఆఫ్ సమయంలో నిఫ్టి 16,447 పాయింట్లకు పడింది. అక్కడి నుంచి 150 పాయింట్లు కోలుకోవడం విశేషం. యూరో మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి ఫైనాన్షియల్, నిఫ్టి నెక్ట్స్ దాదాపు రెండు శాతం లాభంతో ముగిశాయి. టాప్ గెయినర్స్ ఎప్పటికపుడు మారుతూ వచ్చాయి. అనూహ్యంగా నిఫ్టిలో హిందుస్థాన్ లీవర్ టాప్ గెయినర్‌గా నిలిచింది.