వెబ్ వెర్క్స్ రూ. 500 కోట్ల డాటా సెంటర్
క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ అయిన వెబ్ వెర్క్స్.. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో ఓ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో కంపెనీ కార్యాలయం ఉండగా, దాన్ని రూ.500 కోట్లతో డేటా సెంటర్‌గా మార్చనుంది. ఈ ఏడాది ఆఖరుకల్లా యూనిట్ రెడీ అవుతుందని, దీనివల్ల కనీసం 100 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది. తెలంగాణలో ఈ డాటా సెంటర్‌ను తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంస్థ వ్యవస్థాపక సీఈవో నిఖిల్ రాఠీ అన్నారు. ఐటీ, బీమా, బయోటెక్, ఆర్థిక, సేవా రంగాల్లో ఇక్కడ తమకు ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు.