For Money

Business News

16350పైన ముగిసిన నిఫ్టి

ఉదయం నుంచి అనిశ్చితిలో ఉన్న నిఫ్టికి యూరప్‌ మార్కెట్లు దశ, దిశ చూపాయి. రాత్రి అమెరికా మార్కెట్లు క్షీణించడం, ఉదయం నామ మాత్రపు లాభాల్లో ఉండటం, ఆసియాలో మిశ్రమ ధోరణి.. వెరశి భారత మార్కెట్లు అనిశ్చితిలో ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనకొద్ది నిమిషాల్లోనే 15,990కి పడిపోయాయి. యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ప్రారంభమయ్యే సరికి మన మార్కెట్లు కూడా క్రమంగా బలపడుతూ వచ్చింది. యూరో మార్కెట్లు ఓపెనింగ్‌ను భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. జర్మనీ డాక్స్‌తో పాటు అనేక కీలక సూచీలు నాలుగు శాతం లాభపడంతో మన సూచీలు కూడా పరుగులు పెట్టాయి. ఒకదశలో 16,418 తాకినా… చివర్లో స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో లాభాలు స్వీకరించడంతో నిఫ్టి 16345 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 331 పాయింట్లు లాభపడింది. అలాగే సెన్సెక్స్‌ 1223 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇవాళ అత్యధికంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 2.6 శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి చాలా రోజుల తరవాత 2 శాతం లాభంతో ముగిసింది. ఇటీవల భారీ అమ్మకాల ఒత్తిడికి లోనైన ఏషియన్‌ పెయింట్స్‌ నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌గా నిలిచింది. ఇవాళ ఆయిల్‌ ధరలు కూడా 125 డాలర్లకు క్షీణించాయి. బ్యాంక్‌ నిఫ్టిలోని 12 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం.