NIFTY TODAY: నిలబడుతుందా?
నాలుగు రోజుల వరుస నష్టాల తరవాత నిఫ్టి నిన్న లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు గ్రీన్‌లోకి వస్తున్నాయి.. కాని చివరల్లో నష్టాల్లో ముగుస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాలను కోల్పోతున్నాయి. మార్కెట్ ఇవాళ యూరో మార్కెట్ సమయంలో కీలక మలుపు తీసుకునే అవకాశముంది. ఇక డే ట్రేడింగ్ విషయానికొస్తే చాలా మంది టెక్నికల్ అనలిస్టులు సెల్ ఆన్ రైజ్ మోడ్‌లో ఉండాలని అంటున్నారు. అధిక స్థాయిలో నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు ఆగమంటున్నారు. పైగా రేపు వచ్చే యూపీతో సహా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. టెక్నికల్ సూచీలన్నీ సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. మరి ఎక్కడ ప్రతిఘటన ఉంది? ఎక్కడ మద్దతు లభిస్తుందో… కింద లెవల్స్ చూడండి…
అప్ బ్రేకౌట్ 16,229
రెండో ప్రతిఘటన 16,169
తొలి ప్రతిఘటన 16,128
నిఫ్టి కీలక స్థాయి15,900
తొలి మద్దతు 15,898
రెండో మద్దతు 15,858
డౌన్ బ్రేకౌట్ 15,798
నిఫ్టి బలహీనంగా ఉంటే 16079 వద్దే ప్రతిఘటన ఎదురు కావొచ్చు. మిడ్ సెషన్ తరవాత, క్లోజింగ్ ట్రేడ్‌ను గమనించగలరు.