For Money

Business News

ఇంటి రుణాలపై తక్కువ వడ్డీ

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా.. అలాగే మనదేశంలోకూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది. కాబట్టి ఇంటి రుణం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది అద్భుత అవకాశం. సాధ్యమైనంత త్వరగా ఇంటి రుణం తీసుకోవడం ఉత్తమం. అనేక బ్యాంకులు ఇంటి రుణాలపై తక్కువ వడ్డీ అని చెబుతున్నా పరోక్షంగా అనేక ఫీజులు ఉంటాయి.పైగా అన్ని బ్యాంకులు ఒకటే వడ్డీ రేటు ఇవ్వవు. పైగా మీ సిబిల్‌ క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి వడ్డీ కూడా ఉంటుంది. ఇపుడు మార్కెట్‌లో అయిదు  బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే ఇంటి రుణాలు ఇస్తున్నాయి. అవి..
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర : 6.40 శాతం
బంధన్‌ బ్యాంక్‌ : 6.40 శాతం నుంచి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా : 6.50 శాతం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ : 6.50 శాతం
పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ : 6.50 శాతం
క్రెడిట్‌ స్కోరు బాగున్నవారికి అతి తక్కువ వడ్డీ రేటు రాకడమే గాక.. సహ దరఖాస్తుల్లో మహిళ ఉండే పక్షంలో మరో 0.05 శాతం మేర వడ్డీ తగ్గుతుంది.