For Money

Business News

రూపాయి 80కి పడిపోతుంది

కరెన్సీ మార్కెట్‌లో రూపాయి మరింతగా బక్కచిక్కిపోవడం ఖాయమని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. క్రూడ్‌, డాలర్‌ పెరుగుతున్న కారణంగా నిన్న ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్‌ ఎక్స్ఛేంజి మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి 77కు పడిపోయిన విషయం తెలిసిందే. ఇది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి. అయితే రూపాయి వెంటనే కోలుకునే పరిస్థితి లేదని… డాలర్‌తో రూపాయి విలువ 80లను క్రాస్‌ చేస్తుందని ఎకనామిక్‌ టైమ్స్‌ జరిపిన సర్వేలో 14 మంది బ్రోకరేజి సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఉక్రెయిల్‌పై యుద్ధం ఆగని పక్షంలో రానున్న వారాల్లో కరెన్సీ మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి బలహీన పడటం వల్ల ఎగుమతిదారులు భారీగా లబ్ది పొందే అవకాశముంది. ముఖ్యంగా ఐటీ రంగం లాభపడనుంది. మార్కెట్‌లో రూపాయికి అండగా ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనివల్ల రూపాయి మరింత బలహీనపడే అవకాశముందని కరెన్సీ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.