ఉక్కు మరింత భారం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని కమాడిటీస్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు, ఉక్కు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోబొగ్గు ధర ఏడాదిలో రెట్టింపు అయింది. ఈ మధ్యనే 20 శాతం పైగా పెరిగింది. ఇక ఉక్రెయిన్, రష్యాల నుంచి స్టీల్ సరఫరా తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్‌ఆర్‌సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచాయి. హెచ్‌ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు పెంచక
తప్పడం లేదని కంపెనీలు అంటున్నాయి.