అమెరికాలో భారత్ బయోటెక్‌కు షాక్
అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)లో భారత కంపెనీ భారత్ బయోటెక్‌కు షాక్ తగిలింది. 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కుల పిల్లలకు కోవాగ్జిన్ వేసేందుకు అత్యవసర అనుమతి ఇవ్వాలంటూ పెట్టుకున్న దరఖాస్తును ఎఫ్‌డీఏ తిరస్కరించింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ అమెరికా భాగస్వామ్య కంపెనీ ఒక్యూజెన్ తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయెటెక్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. పిల్లలకు ఈ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి కోసం ఎఫ్‌డీఐతో మళ్ళీ ప్రయత్నిస్తామని ఒక్యూజెన్ తెలిపింది.