16,300 దిగువన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి నష్టాల స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16,274కు చేరిన నిఫ్టి… ఇపుడు 16276 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 221 పాయింట్లు నష్టపోయింది. దాదాపు అన్ని సూచీలదీ అదే పరిస్థితి. బ్యాంక్ నిఫ్టి అత్యధికంగా 1.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మెటల్స్ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్లు నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉండటంతో ఏషియన్ పెయింట్స్ 5 శాతంపైగా నష్టపోయింది. టాటా మోటార్స్, మారుతీ కూడా అదే బాటలో ఉన్నాయి. ఆటో షేర్లలో కూడా ఒత్తిడి కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టి సూచీలో ఒక్క గెయినర్ కూడా లేదు.