For Money

Business News

NIFTY TRADE: 16,000 పుట్‌ రైటింగ్‌

నిన్నటి వరకు 16200 వద్ద పుట్‌ రైటింగ్‌ చాలా అధికంగా ఉండేది. అంటే మార్కెట్‌కు అది బేస్‌ పరిగణించేవారు. ఇపుడు ఆ బేస్‌ 16000కు చేరిందని అంటున్నారు డేటా అనిలిస్ట్‌ వీరేందర్‌ కుమార్. మార్కెట్‌ భారీ నష్టాల తరవాత కొనుగోలు చేయడం కన్నా.. ఇప్పటికే షార్ట్‌ చేసినవారు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు. నిఫ్టికి గ్యాప్‌ డౌన్‌ తరవాత మద్దతు వచ్చిన నిలబడుతుందా అన్నది అనుమానమే. కాబట్టి లెవల్స్‌ను బట్టి ట్రేడ్‌ చేయండి. సిమెంట్, ఆటో, బ్యాంకింగ్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. దీనికి దీటుగా దేశీయ ఆర్థిక సంస్థలు కొనుగోలు చేయలేక పోతున్నాయి. నిఫ్టికి అధిక స్థాయిలో 16560 లేదా 16623 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఇక పడితే 16448 లేదా 16408 వద్ద మద్దతు రావాలి. లేదంటే 16357 లేదా 16,318 వద్ద మద్దతు అందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల డేటా కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=7LmGVX60uTI