లాభాలతో మొదలై… నష్టాల్లోకి
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో వాల్‌స్ట్రీట్ లాభాలతో ప్రారంభమైంది. కాని ఆ ఆనందం ఎక్కువ సేపు నిలబడలేదు. యూరో మార్కెట్ల భారీ నష్టాలతో వాల్‌స్ట్రీట్ కూడా నష్టాల్లో జారుకుంది. యూరప్‌లోని ప్రధాన మార్కెట్లన్నీ ఇవాళ రెండు శాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది. యూరో స్టాక్స్ 50 సూచీ రెండు శాతం నష్టపోయింది. ఇక అమెరికా విషయానికొస్తే నష్టాలు ఉన్నా డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీల నష్టాలు అరశాతం లోపే ఉన్నాయి. అయితే నాస్డాక్ మాత్రం ఒక శాతంపైగా నష్టంతో ఉంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇతర కరెన్సీలను భయపెడుతోంది. రూబుల్ బక్కచిక్కిపోవడంతో డాలర్ ఇండెక్స్ బలంగా ఉంటోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ 0.45 శాతం పెరిగి 94.85కు చేరింది. ఇక క్రూడ్ మార్కెట్ విషయానికొస్తే ఆసియా మార్కెట్ సమయంలో వచ్చిన లాభాలన్నీ కరిగిపోయాయి. ఇపుడు 112 డాలర్లపైన బ్రెంట్ క్రూడ్ ట్రేడవుతోంది.